నాలుగు తరాల మహిళలతో వరలక్ష్మి వ్రతం: ఉపాసన

21 Aug, 2021 12:38 IST|Sakshi

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగ‌స్ట్‌20న వరలక్ష్మీ వ్రతం కాగా, శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది.

 ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు.వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. ఆ విధంగా మెగా జనరేషన్స్ మహిళలు అందరూ ఒకే చోటకు చేరారు. ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో.. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఓ వైపు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే మరో వైపు  వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలను కూడా చూస్తున్నారని అంటుంటారు. ఇవే గాక సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

మరిన్ని వార్తలు