Korameenu Movie: ఆ ముగ్గురి చుట్టూ తిరిగే 'కొరమీను'.. వీడియో సాంగ్ రిలీజ్

5 Dec, 2022 18:17 IST|Sakshi

ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ వచ్చేసింది. తెలిసిందేలే అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమానికి బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, సింగర్ సునీత ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. 

ద‌ర్శ‌కుడు శ్రీప‌తి క‌ర్రి మాట్లాడుతూ.. 'మా టీమ్‌కి స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన దర్శకులు వ‌శిష్ట‌గారికి, సింగర్  సునీత గారికి థాంక్స్‌. సినిమాకు కథ ప్ర‌ధానం. అది బావుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ ర‌వి అంత మంచి క‌థ‌ను ఇచ్చారు. ఆయ‌న ద‌గ్గ‌రే విష‌యాలు నేర్చుకున్నా. మా గురువుగారినే డైరెక్ట్ చేశా. క‌థ‌ను చ‌క్క‌గా డ్రైవ్ చేసేది టీమ్‌.' అని అన్నారు. 

నిర్మాత స‌మ‌న్య రెడ్డి మాట్లాడుతూ..'ఆనంద్ ర‌వి క‌థ చెప్పిన‌ప్పుడు బావుంద‌నిపించింది. కీ రోల్‌లో శ‌త్రు, విలన్‌గా హరీష్ ఉత్త‌మ‌న్‌గా తీసుకోవాల‌ని అనుకున్నాం. ఇక హీరోగా ఆనంద్ ర‌విగారు అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది.' అని అన్నారు.

(ఇది చదవండి:  'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్)

దర్శకుడు వ‌శిష్ట మాట్లాడుతూ..'ప్రతినిధి, నెపోలియన్ సినిమాలకు రైటర్‌గా, హీరోగా స‌క్సెస్ అయ్యారు. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్‌ప్లే అందించి హీరోగా కూడా న‌టించారు. ఈ సినిమాతోనూ స‌క్సెస్ సాధిస్తార‌ని భావిస్తున్నా. నిర్మాత, దర్శకుడితో స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌.' అని అన్నారు.

సింగ‌ర్ సునీత్ మాట్లాడుతూ..'ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీత‌లు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త న‌టీన‌టుల‌తో చేసిన మూవీ అయినా ప్ర‌పంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటోంది. అటువంటి లిస్టులో కొర‌మీను సినిమా కూడా చేరుతుంది. మ‌న జీవన విధానానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు స‌క్సెస్ అవుతాయి.' అని అన్నారు.

హీరో ఆనంద్ ర‌వి మాట్లాడుతూ.. 'కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశార‌నే క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ఈ ప్ర‌పంచ‌మంతా సినిమాల్లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, కిడ్నాప్ మిస్ట‌రీలుంటాయి. కానీ ఓ మ‌నిషికి మీసాలు ఎవ‌రు తీసేసుంటార‌నే కాన్సెప్ట్ ఎక్క‌డా లేదు. క‌థ పుట్టిందే అక్క‌డ నుంచే. పేద‌వాడికి, గొప్ప వాడికి మ‌ధ్య జరిగే గొడ‌వను క‌థ‌లో తీసుకున్నాం. సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు ఎంతో కీల‌కం. మీరు సినిమా చూస్తే స‌ర్ ప్రైజ్ అవుతారు. డిసెంబ‌ర్ 31న సినిమాను చూసి న్యూ ఇయ‌ర్‌ను హ్యాపీగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను.' అని అన్నారు.

'కొరమీను' కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది.  

మరిన్ని వార్తలు