కోరమీసం పోలీసోడా..

26 Dec, 2020 00:02 IST|Sakshi
రవితేజ, శ్రుతీహాసన్‌

హీరో రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం ‘క్రాక్‌’. శ్రుతీహాసన్‌ కథానాయికగా నటించారు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి.మధు నిర్మించారు. ఎస్‌.తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కోరమీసం పోలీసోడా..’ అంటూ సాగే మూడో లిరికల్‌ వీడియో సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కోరమీసం పోలీసోడా..’ అంటూ సాగే ఈ రొమాంటిక్‌ మెలోడీకి రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యం అందించారు.

రమ్యా బెహరా తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. పోలీస్‌ యూనిఫామ్‌లో ఉన్న రవితేజను టీజ్‌ చేస్తూ శ్రుతీహాసన్‌ ఈ పాట పాడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇంటెన్స్‌ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలున్నాయి. మా సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు