అప్పుడే డైరెక్టర్‌గా రిటైర్‌మెంట్‌ ప్రకటించిన కొరటాల శివ!

15 Jun, 2021 21:25 IST|Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకడు. నేడు జూన్‌ 15 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, స్టార్‌ హీరోలు శుభాకంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆయన బర్త్‌డే నేపథ్యంలో కొరటాలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న కొరటాల శివ తన రిటైర్‌మెంట్‌ గురించి ముందుగానే ప్లాన్‌ చేసుకున్న విషయం తెలుసా!. దర్శకుడిగా మారినప్పుడే తాను10 చిత్రాలను తెరకెక్కించాలని, ఆ తర్వాత రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని అనుకున్నట్లు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు. 

ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికి దర్శకుడిగా మాత్రం ఉండనని చెప్పుకొచ్చేవాడు. అంతేగాక నిర్మాతగా చేయాలనేది ఆయన కోరిక అని, అందుకే దర్శకుడిగా మారడానికి ముందే 10 కథలను రాసిపెట్టుకున్నట్లు చెప్పాడు. వాటిని పూర్తి చేసి.. డైరెక్షన్‌కు గుడ్‌బై చె‍ప్పేసి.. నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మిస్తానంటు గతంలో ఓ స్టెట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఇంతటి సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అతి తక్కువ కాలంలోనే రిటైర్మెంట్‌ తీసుకోవడమనేది నిజంగా బాధకరమైన విషయమే. మరీ ఆయన ఫిక్స్‌ అయినట్లుగా రిటైర్‌మెంట్‌ తీసుకుంటారా? లేదా? అనేది 10 సినిమాల తెరకెక్కించేవరకు వేచి చూడాలి.

కాగా ప్రభాస్‌ ‘మిర్చి’ మూవీతో దర్శకుడిగా మారిన కొరటాల ఇప్పటి వరకు నాలుగు సినిమాలను రూపొందించాడు. ఈ నాలుగు చిత్రాలు కూడా సూపర్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నాయి. అంతటి సక్సెఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన మిర్చి మూవీకి ముందు ‘బృందావనం, మున్నా, భద్ర’ వంటి చిత్రాలకు రచయితగా పని చేయగా.. సింహా సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లేను అందించాడు. దీనితో పాటు మరిన్ని సినిమాలకు కూడా ఆయన కథలు అందించాడు. ప్రస్తుతం కొరటాల చిరంజీవి ఆచార్య మూవీని తెరకె​క్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ  తర్వాత ఆయన జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు. 

మరిన్ని వార్తలు