స్టూడెంట్‌ లీడర్‌

29 Nov, 2020 00:20 IST|Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సుధాకర్‌ మిక్కిలినేని నిర్మించనున్నారు. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బన్నీ (అల్లు అర్జున్‌) పాత్ర కొంత భాగం స్టూడెంట్‌ లీడర్‌గా ఉంటుందట. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారతారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారట అల్లు అర్జున్‌. ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2022 ఆరంభంలో విడుదల  చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా