కోట బొమ్మాళి పీఎస్‌లో..

2 Aug, 2023 00:15 IST|Sakshi

శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో, రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘రాజకీయాలు, పోలీసుల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో ‘కోట బొమ్మాళి పీఎస్‌’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: రంజిన్‌ రాజ్, మిధున్‌ ముకుందన్‌.

మరిన్ని వార్తలు