డైరెక్టర్‌గా మారిన 30 ఇయర్స్‌ పృథ్వీ, కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ..

8 May, 2023 01:38 IST|Sakshi
క్రాంతి, శ్రీలు

క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్‌ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్‌ పట్టారు. గుంటక శ్రీనివాస్‌ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు.

‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్‌గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు