డేట్‌ ఫిక్స్‌

20 Dec, 2020 02:18 IST|Sakshi

చాలారోజులుగా మిస్‌ అయిన జోష్‌ను మళ్లీ థియేటర్స్‌కి తీసుకురావడానికి రెడీ అంటోంది ‘క్రాక్‌’ టీమ్‌. ఇందుకోసం డేట్‌ని కూడా ఫిక్స్‌ చేసింది. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌ శీను, బలుపు’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేశారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు రవితేజ. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్‌.

మరిన్ని వార్తలు