హనుమాన్‌ కంటే శ్రీ ఆంజనేయం బెటర్‌.. కృష్ణ వంశీ రియాక్షన్‌ వైరల్‌

12 Feb, 2024 14:08 IST|Sakshi

ఈ సంవత్సరం సంక్రాంతి హిట్‌గా 'హనుమాన్' చిత్రం నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై  రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్‌ అవుతుంది. తాజాగా ఈ సినిమా 300 సెంటర్‌లలో 30రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా హనుమాన్‌ ఉండటం విశేషం.

హనుమాన్‌ చిత్రం గురించి సోషల్‌ మీడియా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రం గురించి ఇప్పుడు మళ్లీ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.నితిన్‌, ఛార్మి నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. సినిమా కథ బాగున్నప్పటికీ కొన్ని పాయింట్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేదని చెప్పవచ్చు. కానీ ఇందులో కూడా గ్రాఫిక్స్‌ పనితీరును మెచ్చుకోవాల్సిందే.

తాజాగా నెటిజన్లు కొందరు హను మాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్‌ పేజీలో పలు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదో అంటూ తిడుతూ ఒక పోస్ట్‌ పెట్టాడు. దానికి డైరెక్టర్‌ కృష్ణ వంశీ రియాక్ట్‌ అయ్యారు. ప్లీజ్‌ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు..  శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. 

ఇంతలో మరో నెటిజన్‌ శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించేలా ఉందని చెప్పాడు. ఈ కారణంతోనే సినిమా ప్లాప్‌ అయిందని తెలిపాడు. అందుకు కృష్ణ వంశీ మాత్రం గాడ్ బ్లెస్ యు అని రిప్లై ఇచ్చారు. వాస్తవంగా అప్పట్లో ఆ సినిమా ప్లాప్‌కు కారణం ఛార్మి పాత్రే అని ఎక్కువగా కామెంట్లు చేశారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ కథలో ఛార్మి పాత్రను క్రియేట్‌ చేసిన విధానం బాగలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రంలో మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ సాంగ్‌ ఉండటం ఎవరికీ నచ్చలేదు. నితిన్‌ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించడం పెద్దగా వర్కౌట్‌ కాలేదని చెప్పవచ్చు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega