Krishnam Raju Assets Details: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

13 Sep, 2022 19:08 IST|Sakshi

‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన నటించి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణంరాజు. 1940లో సినీ ఇండస్ట్రీలో అ‍్రగ హీరోగా రాణఙంచిన ఆయన విలన్‌గా, హీరో, సహా నటుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్‌ 11న) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి.

చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్‌ కామెంట్స్‌

సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన నటనపై ఆసక్తికితో ఇండస్ట్రీ వచ్చి అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆయన పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణంరాజుకు వారసత్వంగా బాగానే ఆస్తులు కలిసోచ్చాయట. అంతేకాదు సినిమా రంగంలో కూడా ఆయన బాగానే ఆస్తులు సంపాదించారట. కృష్ణంరాజు మరణాంతరం ఆయన ఆస్తులు చిట్టా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు ఆయన జన్మించారు. 

నిజానికి కృష్ణంరాజు తండ్రి స్వస్థలం రాజమండ్రి. కానీ ఆయన మేనత్త మెట్టినిల్లు మొగల్తూరుకే తన తండ్రి, ఆయన సోదరులు వచ్చేశారని గతంలో​ ఆయన వెల్లడించారు. కృష్ణంరాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి వచ్చింది. ఇప్పటికి ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం కూడా ఉందట. ఇక జూబ్లిహిట్స్‌లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా?

సినిమాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆయన చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లుతో పాటు పలు ఆస్తులు కూడా కొనుగోలు చేశారని సమాచారం. ఇక కృష్ణంరాజు దగ్గర రూ. 90 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్‌తో పాటు రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ. 90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో కృష్ణంరాజు అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ. 8.62 కోట్ల ఆస్తులు, రూ. 2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అప్పట్లోనే ఆయన కుటుంబంలో 4 కిలోల బంగారం ఉండేదట. ఇవన్ని కలిపి కృష్ణంరాజు ఆస్తుల విలువ రూ. 200 నుంచి 300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు