అలా తుదిశ్వాస విడవాలి.. కృష్ణంరాజు పాత ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌

11 Sep, 2022 18:33 IST|Sakshi
కృష్ణంరాజు (ఫైల్‌ ఫోటో)

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు(83) మృతితో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరణం గురించి గతంలో కృష్ణంరాజు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్ట వైరల్‌గా మారాయి.

(చదవండి: 'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్‌)

దాదాపు 16 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో  తానెలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పారు కృష్ణంరాజు.  ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని, నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలి. అదే నా కోరిక’ అని కృష్ణంరాజు  చెప్పారు .ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 

కాగా,కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం(సెప్టెంబర్‌12) మధ్యాహ్నం జరగనున్నాయి. చేవెళ్లలోని మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు