Kaikala Satyanarayana: కైకాలను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు: కృష్ణం రాజు భార్య

23 Dec, 2022 18:04 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కడసారి ఆయనను కళ్లారా చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు సెలబ్రిటీలు. సోషల్‌ మీడియా వేదికగా తారలు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కైకాల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆయన భార్య, కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆ మధ్య కృష్ణంరాజు గారు.. ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి.. అని అడిగితే ఖచ్చితంగా వస్తానని, మీరే ఒక టైం చూసి చెప్పమన్నారు. కానీ ఆయన మా ఇంటికి రాలేకపోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజుతో అనేక అద్భుత చిత్రాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం.

లెజెండరీ నటుడైన కైకాల ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడంటే కేవలం అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరమవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని తెలిపారు శ్యామల.

చదవండి: అదే ఆయన చివరి కోరిక.. కానీ అది తీరకుండానే కన్నుమూసిన కైకాల
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే!

మరిన్ని వార్తలు