బేబమ్మ హవా.. మరో రెండు క్రేజీ ఆఫర్లు కొట్టెసిన కృతీ శెట్టి

8 Jul, 2021 21:04 IST|Sakshi

తొలి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌ అంతా క్రేజ్‌ సంపాదించుకుంది కన్నడ భామ కృతీ శెట్టి. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన ఉప్పెన మూవీలో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ భారీ హిట్‌ సాధించి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే తొలి మూవీ విడుదలకు ముందే కృతీ తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసింది. నాని సరసన శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో పాటు సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్‌గా ఆఫర్‌ కొట్టెసింది.

అలాగే లిగుస్వామి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో రాబోతోన్న ఉస్తాద్‌ మూవీలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో రెండు ప్రాజెక్ట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కింగ్‌ నాగార్జున్‌ అక్కినేని హీరోగా బంగార్రాజు మూవీ రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన మూవీకి సిక్వెల్‌గా క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సిక్వెల్‌ను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా కృతీ శెట్టిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఇప్పటికే చైకి జోడిగా సమంత, మలయాళ బ్యూటీ  ప్రియాంక అరుల్‌ మోహన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా బజ్‌ ప్రకారం మేకర్స్‌ కృతీ శెట్టిని నాగ చైతన్యకు జోడిగా తీసుకోవాలని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బేబ‌మ్మ (కృతిశెట్టి) బంగార్రాజు తారాగ‌ణంలో చేరిపోతుందా లేదా అనేది అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దీనితో పాటు కృతీ యంగ్‌ హీరో నితిన్‌తో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు