2 రోజులు నరకం అనుభవించాం, ప్లీజ్‌..: హీరోయిన్‌

4 May, 2021 08:02 IST|Sakshi

సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనాకు ఎంతోమంది బలవుతున్నారు. ఆక్సిజన్‌ కోసం మరెంతో మంది చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి కర్బందా అభిమానులను అభ్యర్థించింది. తను అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదంటూ ట్వీట్‌ చేసింది. 'గత 48 గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకుప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నారని గ్రహించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్‌ తీసుకోకండి..' అని కృతి చెప్పుకొచ్చింది. ఇది చూసిన జనాలు ఆమె ఫ్యామిలీ కరోనా బారిన పడినట్లుందని భావిస్తున్నారు.

కాగా కృతి తెలుగులో తీన్‌మార్‌, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది.

చదవండి: అందుకే విడాకులు తీసుకున్నా: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు