ప్రభాస్‌ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్‌

28 Aug, 2021 20:31 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిబిజీగా గుడుపుతున్నాడు. తను నటిస్తున్న సలార్‌, ఆదిపురుష్‌ చిత్రాల షూటింగ్‌ శరవేగంగా జరుపుకుటున్నాయి.  ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌ మూవీ కోసం హీరో ప్రభాస్‌ ముంబైలో ఉన్నాడు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తుండగా సీతగా కృతీ సనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.
చదవండి: సెప్టెంబర్ 17న నితిన్‌ మాస్ట్రో: హాట్‌స్టార్‌ ప్రకటన

తాజాగా ఆదిపురుష్‌లో సీతగా నటిస్తున్న హీరోయిన్‌ కృతి సనన్‌.. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం గురించి వివరించారు. చాలా కాలంగా ప్రభాస్‌తో వర్క్‌ చేయాలని అనుకుంటుంటున్నట్లు ఆ కోరిక ఇప్పుడు తీరిందని పేర్కొన్నారు. ‘ప్రభాస్‌ చాలా పొడవుంటాడు. మేమిద్దరం ప్రొఫెషనల్‌ కాస్టూమ్స్‌లో ఉన్నప్పుడు మా జంట మరింత బాగుంటుంది. మొదటి షెడ్యూల్‌లో తొలిసారి ప్రభాస్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు అతనితో మరో షెడ్యూల్‌ చేయబోతున్నాను. అతను చాలా సరదా వ్యక్తి. మంచివాడు. ఎంతో వినయస్తుడు. భోజన ప్రియుడు. అలాగే ప్రభాస్‌ చాలా బిడియస్తుడని, ఎవరితో ఎక్కువగా మాట్లాడడని అందరూ అనుకుంటారు. కానీ అది అస్సలు నిజమని నేను అనుకోను. అతను చాలా బాగా మాట్లాడతాడు. అతనితో నాకు మంచి సన్నిహిత్యం ఉంది’ అని వెల్లడించారు. 
చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ పేరును మెడపై టాటూ వేసుకున్న నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు