బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి 7 ఏళ‍్లు, అక్కడ చేదు అనుభవం: కృతి సనన్‌

23 May, 2021 22:32 IST|Sakshi

‘వన్‌.. నేనోక్కడినే’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్‌. తొలి చిత్రంలోనే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో ఆడిపాడింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చిన కృతి అక్కడ సక్సెస్ఫు‌ల్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సరసన నటిస్తూ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది కృతి. కాగా బాలీవుడ్‌లో ఆమె నటించిన తొలి చిత్రం ‘హీరోపంతి’. ఈ మూవీ విడుదలై నేటికి 7 ఏళ్లు. ఈ సందర్భంగా కృతి బి-టౌన్‌లో తన ఏడేళ్ల సినీ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్‌ చేసింది.

‘నేను నటిని అవుతానని ఎప్పుడు ఊహించలేదు. ఇది నా డ్రీం కూడా కాదు. అనుకోకుండా పరిశ్రమలోకి వచ్చాను.  ఎందుకంటే మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ ప్రొఫెసర్‌, నాన్న చార్టెడ్‌ అకౌంటెంట్‌.  కానీ ఇందులోకి వచ్చాకే అర్థమైంది. యాక్టింగ్‌ నన్ను ఎంతగ ఆకట్టుకుందని, అది నన్ను ఉత్సాహంగా ఉంచుతుందని’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన తనకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురైనట్లు కృతి వెల్లడించింది. ‘నేను బయటి వ్యక్తి కావడం వల్ల కొన్ని సార్లు నేనే ఒంటరిని అనే భావన కలిగింది.

ఇక్కడ నటిగా నాకు గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టింది. మొదట్లో అంత నాకు కొత్తగా ఉండేది. నాకు అప్పుడు ముంబై కూడా కొత్తే. సినిమా బ్యాగ్రౌండ్‌ లేని వ్యక్తిగా పరిశ్రమలోకి రావడం వల్ల ఇక్కడ నేను ఎవరికి అంతగా తెలియదు. దాని వల్ల పలు సినిమా వేడుకల్లో ఒంటరిగా ఉండేదాన్ని. ఎవరూ అంతగా మాట్లాడేవారు కాదు. అది నాకు చాలా బాధగా అనిపించేది. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు అలాగే ఫీల్‌ అవుతాను. అయితే హీరోయిన్‌గా నేను ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. ఎన్నో అపజయాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను’ అంటు కృతి తెలిపింది. చివరగా ఆమె హిందీలో ‘బచ్చన్‌ పాండే’ మూవీలో నటించింది. ప్రస్తుతం ప్రభాస్‌తో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో సీతగా కనిపించనుంది. 

A post shared by Kriti (@kritisanon)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు