Kamaal R Khan: ‘రణ్‌బీర్‌- అలియా పెళ్లవుతుంది, కానీ కలిసుండలేరు’

15 Jul, 2021 10:20 IST|Sakshi

సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే)కు విమర్శలు కొత్తేమీ కావు. సెలబ్రిటీల మీద సెటైర్‌ వేయనిదే ఆయనకు పొద్దు గడవదు. కానీ తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్‌ చేస్తే ఫ్యాన్స్‌కు నచ్చదు. దీంతో తరచూ ట్రోలింగ్‌కు గురవతుంటాడు కేఆర్‌కే. తాజాగా బాలీవుడ్‌లో ప్రముఖ ప్రేమజంట మీద సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

ఎంతో అన్యోన్యంగా ఉంటున్న స్టార్‌ జంట ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ రానున్న పదేళ్లలో విడాకులు తీసుకోవడం తథ్యం అంటూ నోరు పారేసుకున్న కేఆర్‌కే తాజాగా మరో ప్రేమజంట మీద పడ్డాడు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జోడీ మీద జోస్యం చెప్పాడు. వీళ్లిద్దరికీ 2022లో వివాహం అవుతుందని, కానీ పెళ్లైన 15 ఏళ్లకు విడాకులు తీసుకుంటారని జోస్యం పలికాడు. బాలీవుడ్‌ నటీమణులు కంగనా రనౌత్‌, టబు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే మిగిలిపోతారని తెలిపాడు. వీరికి జీవితంలో పెళ్లి భాగ్యమే లేదని తేల్చి చెప్పాడు.

అయితే ఇతడి అంచనాలు, అభిప్రాయాలు నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. 'ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందనే ఎందుకు ఊహిస్తావు?' అని ప్రశ్నిస్తున్నారు. 'నోటి నుంచి మంచి మాటలే రావా?' అని తిట్టిపోస్తున్నారు. 'ఇంకా నయం, రణ్‌బీర్‌ అసలు అలియాను పెళ్లే చేసుకోడు అని చెప్పలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు