దిశాకు బర్త్‌డే విషెస్‌, మరోసారి సల్మాన్‌ మీద వ్యంగ్యాస్త్రాలు

13 Jun, 2021 14:23 IST|Sakshi

నేడు(జూన్‌ 13) బాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ నటి దిశాపటానీ బర్త్‌డే. 'లోఫర్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ తర్వాత హిందీ చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఈ మధ్యే వచ్చిన 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌' సినిమాలో స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా నటించిందీ భామ. ఆదివారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని నటుడు, సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) దిశాకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ మేరకు చేసిన ట్వీట్‌లో సల్మాన్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

"ప్రియమైన దిశాపటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముసలి నటుల పక్కన నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. కాబట్టి నువ్వు కేవలం టైగర్‌ సరసన మాత్రమే నటిస్తే బాగుంటుంది" అని కేఆర్‌కే రాసుకొచ్చాడు. దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా వుంటే ఇటీవలే సల్మాన్‌ కేఆర్‌కేపై కేసు ఫైల్‌ చేశాడు. రాధే సినిమాపై తనకు అనుకూలంగా రివ్యూ ఇవ్వనందుకే సల్మాన్‌ తన మీద కేసు వేశాడని కేఆర్‌కే ఆరోపించాడు.

అయితే అది రివ్యూ కోసం కాదని, మనీలాండరింగ్‌ ఆరోపణలు చేసినందుకు గానూ కేసు నమోదు చేశామని సల్మాన్‌ లాయర్‌ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయంలో తాను సల్మాన్‌కు క్షమాపణలు చెప్పనని, 20 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు మద్దతుగా ఉన్నారని కేఆర్‌కే చెప్పుకొచ్చాడు. వారందరూ ఆయనతో నేరుగా గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా లేరని, వారికోసమైనా తాను పోరాడతానని పేర్కొన్నాడు.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌పై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు