ఆమె అంతే!

4 Oct, 2020 05:13 IST|Sakshi

సౌతిండియా గ్లామర్‌ క్వీన్‌ సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా గతంలో హిందీలో ‘డర్టీ పిక్చర్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. విద్యా బాలన్‌ ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా స్మిత జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అవళ్‌ అప్పడిదాన్‌’ (ఆమె అంతే అని అర్థం) అనే టైటిల్‌ ఖరారు చేశారు. కేయస్‌ మణికందన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, హెచ్‌. మురళి నిర్మించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. టైటిల్‌ రోల్‌లో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ‘సిల్క్‌ స్మిత గ్లామర్‌ను ఇప్పటి వరకూ ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేకపోయారు. ఆమె పాత్రను పోషించే నటి కోసం చూస్తున్నాం’’ అన్నారు దర్శకుడు మణికందన్‌.

మరిన్ని వార్తలు