క్షణక్షణం కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది

9 Feb, 2021 03:05 IST|Sakshi
ఉదయ్‌ శంకర్, గోవింద్, మారుతి, కార్తీక్‌

– మారుతి

‘‘సస్పెన్స్, డార్క్‌ కామెడీ జానర్‌తో పాటు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘క్షణక్షణం’ సినిమా కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్‌ హీరోగా, జియా శర్మ హీరోయిన్‌గా కార్తీక్‌ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. డాక్టర్‌ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని మారుతి విడుదల చేశారు.

ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘క్షణక్షణం’లో డార్క్‌ కామెడీ బాగా కుదిరింది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడంతో పాటు, మా టీమ్‌కి పెద్ద సక్సెస్‌ అందిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.  ‘‘ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.. దీంతో  ప్రేక్షకులు త్వరగా కనెక్ట్‌ అవుతారు. మా సినిమా ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్‌ కానివ్వదు. సందర్భానికి తగ్గట్టు వచ్చే పాటలు సినిమా మూడ్‌ని మరింత ఎలివేట్‌ చేస్తాయి’’ అన్నారు కార్తీక్‌ మేడికొండ. శ్రుతీసింగ్, సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ్‌ రెడ్డి, సంగీతం: రోషన్‌ సాలూరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు