ప్రయోగాలు చేయాలంటే ధైర్యం కావాలి

19 Feb, 2021 03:46 IST|Sakshi

– నిర్మాత బన్నీ వాసు

‘‘ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ‘చావు కబురు చల్లగా’ చేస్తున్నప్పుడు అది ఎక్స్‌పీరియ¯Œ ్స చేశాను. ‘క్షణక్షణం’తో అలాంటి ధైర్యం చేసిన వర్లుగారిని, మౌళిగారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగుండటంతో గీతా ఫిలింస్‌ డిస్ట్రిబ్యూష¯Œ  ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్‌ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్‌ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని ‘బన్నీ’ వాసు  విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి సినిమా వరకే అడ్వాంటేజ్‌.. ఆ తర్వాత వాళ్లు నిరూపించుకోవాల్సిందే’’ అన్నారు. ‘‘క్షణక్షణం’ ట్రైలర్‌ ఎంత బాగుందో, సినిమా కూడా అంతే బాగుంటుంది’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ‘‘క్షణక్షణం’లో కాన్సెప్ట్‌ కొత్తగా ఉంటుంది. పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు కార్తీక్‌ మేడి కొండ. ‘‘హాలీవుడ్‌ నిర్మాత వాల్ట్‌ డిస్నీకి సినిమాలే ప్రపంచం. అదే ప్యాష¯Œ ను ఉదయ్‌లో చూశా’’ అన్నారు డాక్టర్‌ వర్లు. జియా శర్మ, సంగీత దర్శకులు రోష¯Œ  సాలూరి, రఘు కుంచె మాట్లాడారు.

మరిన్ని వార్తలు