అమెజాన్‌ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న మానస్‌ ‘క్షీరసాగర మథనం’

14 Sep, 2021 16:33 IST|Sakshi

‘బిగ్ బాస్‌’ఫేమ్ మానస్, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షీరసాగర మథనం’.అక్షత సోనావని ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై... కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ఫ్రైమ్‌’లో విడుదలై... సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో 499వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం నాని ‘టక్‌ జగదీష్‌’ తార్వాత రెండో స్థానంలో నిలవడం గర్వంగా ఉందని దర్శకుడు అనిల్‌ పంగులూరి పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు