OTT New Movies: ఒకటి క్లాస్ మూవీ.. మరొకటి హారర్ సిరీస్

18 Sep, 2023 19:03 IST|Sakshi

జనాలకు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో కంటే వీటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే ఒకప్పుడు చోటామోటా యాక్టర్స్ ఓటీటీల కోసం మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా స్టార్స్ నటించిన సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీసులు కావొచ్చు నేరుగా ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలా స్టార్ హీరోయిన్స్ నటించిన ఓ మూవీ, ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

(ఇదీ చదవండి: తెలుగు యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?)

మలయాళ బ్యూటీ నిత్యామేనన్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కమ్ సింగర్ అయిన ఈమె.. క్యూట్ యాక్టింగ్‌తో పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. అయితే ఈమెకు రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఓటీటీల్లోనూ నటిస్తూ బిజీ అయిపోయింది. అలా ఈమె ప్రధాన పాత్రలో నటించి 'కుమారి శ్రీమతి'.. ఈ సెప్టెంబరు 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

తమిళ నటి వరలక్ష‍్మి శరత్ కుమార్ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసింది కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో, ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తీసిన హారర్ వెబ్ సిరీస్ 'మ్యాన్షన్ 24'. దీన్ని త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వినాయక చవితి సందర్భంగా ప్రకటించిన ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్ మూవీ/వెబ్ సిరీస్ కావడం విశేషం.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి)

మరిన్ని వార్తలు