బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కుషాకు వీరాభిమానులే

14 Aug, 2022 11:14 IST|Sakshi

కుషా కపిల.. వెబ్‌ దునియాలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ ‘మసాబా మసాబా’ సీజన్‌ 2లో ఆమె పోషించిన మీడియా మేనేజర్‌ ‘నికోల్‌’ పాత్రే ఆ పాపులారిటీకి కారణం. యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి రాకముందు మీడియాలో పనిచేసిన కుషా పరిచయం ఇది..

కుషా ఢిల్లీలో పుట్టిపెరిగింది. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో నిఫ్ట్‌ నుంచి డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. 

కాలేజీ రోజుల్లో స్ట్రీట్‌ ప్లేస్‌ బాగా వేసేది. అయినా యాక్టింగ్‌ ఫీల్ట్‌లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి జర్నలిస్ట్‌ కావాలనుకుంది. 

ఓ ఆన్‌లైన్‌ పత్రికకు ఫ్యాషన్‌ కరెస్పాండెంట్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. తర్వాత వేరు వేరు సంస్థల్లో కాపీ రైటర్, డిజిటల్‌ కంటెంట్‌ హెడ్, కంటెంట్‌ డెవలపర్‌గానూ పని చేసింది. టైమ్స్‌ ఇంటర్నెట్‌లో ఫ్యాషన్‌ ఎడిటర్‌గా కూడా విధులు నిర్వహించింది. 

ఐదివాలో రైటర్‌గా జాయిన్‌ అయినప్పుడే కుషా .. ‘బిల్లీ మాసి’ని క్రియేట్‌ చేసింది. దక్షిణ ఢిల్లీ సంపన్నవర్గంలోని మహిళలను అనుకరిస్తూ సృష్టించిన పాత్ర అది. అలా ‘బిల్లీ మాసి’ పేరుతో కుషా చేసిన వీడియోలకు తెగ క్రేజ్‌ ఏర్పడింది. ఆ పేరుతోనే యూట్యూబ్‌లో ఆమె ఫేమస్‌ అయింది. బాలీవుడ్‌లో కరీనా కపూర్, అనుష్కా శర్మ,సోనమ్‌ కపూర్, కరణ్‌ జోహార్, రణ్‌వీర్‌ సింగ్, అభిషేక్‌ బచ్చన్, అర్జున్‌ కపూర్‌ వంటి స్టార్స్‌ అంతా ఆమెకు వీరాభిమానులు. 

కుషా కవయిత్రి కూడా. ఏ కాస్త సమయం దొరికినా కవిత్వం రాస్తుంది. 

ఆమె అభిరుచులు, యాక్టివిటీసే ఆమెను వెబ్‌ తెరకు పరిచయం చేశాయి. ‘మసాబా మసాబా’ సీజన్‌ 2లో కుషా ప్రదర్శించిన సహజమైన హావభావాలు ఆ ఒక్క సిరీస్‌తోనే ఓటీటీలో ఆమెకు బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సృష్టించాయి. 

అమ్మ చెప్పింది
‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్‌. ఒక టేబుల్‌ స్పూన్‌ శనగ పిండి, ఒక టీ స్పూస్‌ పసుపు, రెండు టీ స్పూన్ల  బాదం పప్పు పొడి, ఒక టేబుల్‌ స్పూన్‌ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని మొహానికి, మెడకు అప్లయ్‌ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్‌తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్‌ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది. – రాధిక మదన్‌  

మరిన్ని వార్తలు