Chiranjeevi: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..

19 Jul, 2022 18:01 IST|Sakshi

Chiranjeevi Introduces Kareena Kapoor As Roopa: బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ 57 ఏళ్ల వయసులోనూ విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈ  చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను చిరంజీవి సమర్పణలో తెలుగు వెర్షన్‌లో కూడా రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. 

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది బాలీవుడ్ దివా కరీనా కపూర్‌. తాజాగా కరీనా పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. 'లాల్‌సింగ్‌ చద్దా' ప్రేయసి 'రూప'గా కరీనాను పరిచయం చేశారు చిరంజీవి. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని  మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క  మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ పోస్టర్‌లో అమీర్ ఖాన్‌ను కరీనా కపూర్ హగ్‌ చేసుకుని ఉండటం చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

చదవండి: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికీ..
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్‌ తమ్ముడు
బాయ్‌ఫ్రెండ్‌ నుంచి కాల్‌.. తర్వాత మోడల్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు