Lal Singh Chaddha: ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావుతో చైతూ.. ఫోటో వైరల్‌

9 Jul, 2021 16:58 IST|Sakshi

నాగచైతన్య ‘లాల్‌ సింగ్‌ చద్దా’సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చైతూకు బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’(1994)కు ఇది హిందీ రీమేక్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్‌లోని ఫోటోని చిత్ర బృందం పంచుకుంది. అందులో ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు, దర్శకుడితో నాగచైతన్య ఉన్నారు. సైనికుడి డ్రెస్‌లో ఆమిర్‌, చైతూ కనిస్తుండటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

కాగా,  ఇటీవల ఆమీర్‌, తన భార్య కిరణ్‌ రావులు ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే `లాల్‌ సింగ్‌చద్దా`కి కిరణ్‌ రావు ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తను కూడా సెట్‌లో ఉండటం విశేషం.  మరోవైపు తెలుగు చైతూ నటించిన `లవ్‌స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు