అత్యాచారం చేశాడు.. పిచ్చిదాన్నైపోయా!

22 May, 2021 14:44 IST|Sakshi

లేడీ గాగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న సింగర్‌. హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్‌ సింగర్‌ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో.. తన గతానికి సంబంధించి కొన్ని చేదు విషయాల్ని బయటపెట్టి కంటతడి పెట్టుకుంది.   

పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్‌ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్‌ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ భయానక అనుభవాన్ని పంచుకుంటూ లేడీ గాగా ఏడ్చేసింది. అయితే గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్‌ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడింది.      

ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మధనపడ్డానని చెప్పిన లేడీ గాగా.. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా అభివర్ణించింది. అయితే ఆ ప్రొడ్యూసర్‌ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. యాపిట్‌ టీవీ ఫ్లస్‌ ఫ్లాట్‌ ఫామ్‌ వారి ‘ది మీ యూ కాంట్‌ సీ’ డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్‌ అయ్యింది. కాగా, గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు