మళ్లీ వస్తున్న 'జోకర్‌'.. హీరోయిన్‌గా పాపులర్ సింగర్‌

6 Aug, 2022 09:29 IST|Sakshi

Lady Gaga As Harley Quinn In Joaquin Phoenix Joker 2: జోకర్‌.. 2008లో వచ్చిన సూపర్‌ హిట్‌ హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మేన్‌: ది డార్క్‌ నైట్‌' సినిమాతో ఎంతో పాపులర్‌ అయ్యాడు. అందులో విలన్‌గా అలరించిన జోకర్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఏర్పడింది. ఈ పాత్రకున్న క్రేజ్‌ చూసిన దర్శకనిర్మాతలు 2019లో 'జోకర్‌' సినిమా తెరకెక్కించారు. జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో అలరించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 1.07 బిలియన్‌ డాలర్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా అనేక ఇంటర్నేషన్ల్‌ అవార్డులను కూడా అందుకుంది. ఈ మూవీలో జోకర్‌గా నటించిన జోక్విన్‌ ఫీనిక్స్‌కు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ రావడం విశేషం.

అయితే ఈ జోకర్ మళ్లీ రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జోకర్‌: ఫోలీ ఎ డ్యూక్స్‌' తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన టాడ్‌ ఫిలిప్స్‌ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ సినిమాను 2024 అక్టోబర్‌ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే 'జోకర్‌'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సీక్వెల్‌లో హార్లే క్విన్‌ అనే కీలక పాత్రలో అమెరికన్ పాపులర్‌ సింగర్‌ లేడీ గాగా అలరించనుంది. 
 

కాగా 2016లో వచ్చిన డిస్నీ సినిమాటిక్‌ ఎక్స్‌టెండ్‌ యూనివర్స్‌ (డీసీఈయూ) మూవీ 'సూసైడ్‌ స్క్వాడ్‌'లో హార్లే క్విన్‌గా మార్గోట్‌ రోబీ పరిచయమైంది. ఇందులో జోకర్‌కు ప్రేయసిగా హార్లే క్వీన్‌ పాత్ర ఉంటుంది. తర్వాత వచ్చిన డీసీ సిరీస్‌లోని బర్డ్స్‌ ఆఫ్‌ ప్రే, ది సూసైడ్‌ స్క్వాడ్‌ చిత్రాల్లో హార్లే క్వీన్‌గా మార్గోట్‌ రోబీ అదరగొట్టింది. మరీ ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌ మూవీ 'జోకర్‌: ఫోలీ ఎ డ్యూక్స్‌'లో లేడీ గాగాను జోకర్‌కు ప్రేయసిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు