'లేడీ లయన్ క్రియేషన్స్' లోగో విడుదల 

9 Aug, 2021 21:20 IST|Sakshi

కొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు సొంతంగా 'లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్‌' పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సహా నిర్మాత గోవింద రాజులు బ్యానర్‌ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. 

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీ లో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు. 

నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా లవ్ యూ ఎనిమి అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు