ఆసక్తి పెంచుతున్న  లక్ష్ చదలవాడ కొత్త మూవీ కాన్సెప్ట్ పోస్టర్ 

10 Oct, 2023 17:49 IST|Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌కు లక్ష్ ఓకే చెప్పేశారు.

లక్ష్ 8వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా.. ఇక అగ్నిజ్వాలలు అలా చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు