కొత్త షో అనౌన్స్‌ చేసిన మంచు వారమ్మాయి..

8 Oct, 2020 20:06 IST|Sakshi

‘మేము సైతం’ షోతో బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు  మంచు లక్ష్మీ ప్రసన్న. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేశారు మంచు లక్ష్మీ. దీని ద్వారా స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు బయటికి తీసుకొచ్చారు. ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అంటూ మంచు లక్ష్మీ చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇక లాక్‌డౌన్ సమయంలో కూడా 'లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు' పేరుతో ప‌లువురు సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆమె ఇంట‌రాక్ట్ అయ్యారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 8న మరో కొత్త షోకు శ్రీకారం చుట్టారు మంచు లక్ష్మీ. ఇందుకు సంబంధించిన ప్రోమోతో త‌న కొత్త షోను అనౌన్స్ చేశారు మంచు లక్ష్మీ. (చదవండి: ‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి)

సౌత్ బే స‌మ‌ర్పిస్తోన్న‌ ఆ షో పేరు 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు'. ఇది కూడా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన 'లాక్డ్ అప్ విత్ ల‌క్ష్మీ మంచు' త‌ర‌హాలోనే ఉండబోతుంది. ఈ షోలో ఆమె ఫిలిమ్స్‌, స్పోర్ట్స్‌, ఫ్యాష‌న్‌, ఫుడ్‌.. త‌దిత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజ‌మౌళితో పాటు లక్ష్మీ ఫ్రెండ్ తాప్సీ ప‌న్ను.. సెంథిల్ రామ‌మూర్తి, సానియా మీర్జా, ప్ర‌కాష్ అమృత‌రాజ్‌, శంత‌ను, నిఖిల్‌, బిభు మొహాపాత్ర‌, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ త‌దిత‌రులు కనిపిస్తున్నారు. సౌత్ బే ప్రెజెంట్ చేస్తున్న 'క‌మింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ ల‌క్ష్మీ మంచు' షో త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు