ఆ పిల్లలకు నేనున్నానంటూ మంచు లక్ష్మి భరోసా

22 May, 2021 10:56 IST|Sakshi

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. సకాలంలో వైద్యసదుపాయం అందక  చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్‌ బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనా కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు. అలాంటి చిన్నారులకు సాయం చేసేందుకు నటి మంచు లక్ష్మి ముందుకొచ్చారు.  'టీచ్ ఫ‌ర్ చేంజ్' అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి 1000 మంది పిల్ల‌ల‌కు విద్య‌, వైద్యం ఇత‌ర ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'కరోనా ప్రభావంతో ఎన్నో కుటుంబాలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నాయి. 'టీచ్‌ ఫర్‌ చేంజ్‌' అనే స్వచ్ఛంధ సంస్థతో కలిసి ఆదాయం తక్కువున్న కుటుంబాలను గుర్తించి వారిలో 1000మందికి విద్య, ట్యూషన్, బట్టలతో పాటు ఇతర సహాయం అందించ‌బోతున్నాం.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అప్పుడే వారు ఆరోగ్యంగా తమ బాల్యాన్ని గడుపుతారు. కానీ కరోనా వల్ల దురదృష్టవశాత్తూ కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను పొగొట్టుకున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేస్తాం. అదేవిధంగా లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా మంది వైద్యం కోసం ఇక్క‌డికి వ‌స్తున్నారు. అలాంటి వారికి ఆహారం దొర‌క‌డం క‌ష్టంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ మొత్తం సమయంలో 1000 మందికి భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకున్నాము. వారి కోసం టీచ్ ఫర్‌ చేంజ్‌ బృందం, మా వాలంటీర్స్ తో పాటు బృంద సభ్యులు ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినందుకు ధన్యవాదాలు' అని మంచు లక్ష్మి తెలిపారు. 

చదవండి : Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్‌
Manchu Manoj: 25 వేల కుటుంబాలను ఆదుకుంటా!

మరిన్ని వార్తలు