రజనీతో సెల్ఫీ షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్‌

13 May, 2021 09:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజాగా చిత్రం ‘అన్నాత్తే’. ఇటీవలె ఈ చిత్రం కోసం దాదాపు 35 రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రజనీ షెడ్యూల్‌ పూర్తయ్యింది. దీంతో షూటింగ్‌ ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని తన ప్రియ స్నేహితుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రజినీతో దిగిన ఫోటోలను మంచులక్ష్మీ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌ అయ్యాయి. ఇక మోహన్‌బాబును కలిసిన అనంతరం ఆయన ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమాన‌శ్ర‌యం నుంచి చెన్నైకి వెళ్లారు. ఇంటికి వచ్చిన రజనీకి ఆయన భార్య హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

గతేడాది డిసెంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభించిన‌ప్పుడు సెట్‌లో కొంద‌రికి క‌రోనా రావ‌డంతో పాటు ర‌జ‌నీకాంత్ కూడా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో షూటింగ్‌ను కొన్ని నెల‌ల పాటు వాయిదా వేశారు. నెల రోజుల క్రితం క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ హైదరాబాద్‌లో షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీతో పాటు నయనతార ​ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక  సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

చదవండి: కోవిడ్‌ పేషెంట్స్‌ కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న నటి
ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు