బిగ్‌ డీల్‌తో ఓటీటీలోకి 'లాల్‌ సలామ్‌'.. భారీగా రజనీకాంత్‌ రెమ్యునరేషన్‌

12 Feb, 2024 11:11 IST|Sakshi

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్‌ సలామ్‌'. ఈ చిత్రంలో యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్  ప్రధాన పాత్రల్లో నటించగా.. రజనీకాంత్  అతిధి పాత్రలో మెప్పించారు. లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్  నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న విడుదలైంది. కానీ ప్రేక్షకులను నిరాశపరిచింది.

సాధారణంగా రజనీకాంత్‌ చిత్రాలకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్‌ ఉంటుంది.  ఈ చిత్రంలో మొయిదీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో లాల్‌ సలాం సినిమాను చూసే వాళ్లు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్‌ తగ్గించేశారు. కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్‌ చేసి డబ్బు కూడా ప్రేక్షకులకు రిటర్న్‌ ఇచ్చేశారు.

ఓటీటీలో ఎప్పుడు
అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ప్రచారం జరుగుతుంది. లాలా సలాం ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన 60 రోజులకు స్ట్రీమింగ్‌ చేయాలని అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారట. కానీ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో కేవలం 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్ చేస్తుందట. 

నిమిషానికి రూ. 1.30 కోట్ల రెమ్యునరేషన్‌
లాల్‌ సలామ్‌ సినిమా కోసం రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారో అంటూ ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ సినిమాలో ఆయన కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. రజనీ ఉన్నంత సేపు సినిమా ఒక రేంజ్‌లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ కోసం రజనీకాంత్‌ సుమారు రూ. 40 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన నిమిషానికి రూ. 1.30 కోట్లు రజనీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega