యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌: లాస్య తురుము అంతే..

11 Jan, 2021 21:06 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న యాంకర్‌ లాస్య సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమె మాటలకు తోడు కొడుకు జున్ను అల్లరిని కూడా కెమెరాల్లో చిత్రీకరించి లాస్య టాక్స్‌ ద్వారా వినోదాలను పంచుతోంది. కొత్త కొత్త కాన్సెప్టులతో ముందుకు వస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంది. అయితే సడన్‌గా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బ్రేక్‌ పడింది. అదేంటి అంటారా? ఎనిమిది లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్న లాస్యటాక్స్‌ ఛానల్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని లాస్య స్వయంగా వెల్లడించింది. అయితే తన ఛానల్‌ను ఎవరు? ఎందుకు? హ్యాక్‌ చేశారో తెలీట్లేదని చెప్పుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని వేరేవాళ్లు చెప్పేవరకు తనకు తెలియలేదని పేర్కొంది. దీనిపైన తన టెక్నికల్‌ టీమ్‌ పని చేస్తోందని, తప్పకుండా లాస్య టాక్స్‌ తిరిగి వస్తుందని చెప్పుకొచ్చింది. అయితే లాస్య ఛానల్‌ హ్యాక్‌ అయినందుకు నోయల్‌ చాలా సంతోషపడ్డాడు. "మా లాస్య అకౌంట్‌ హ్యాక్‌ చేశారంటే ఆమె ఎంత తోపు, తురుము? అని పొగిడాడు. ఎదిగేవాళ్ల అకౌంట్లే హ్యాక్‌ అవుతాయ్‌. నా అకౌంట్‌ కూడా ఒకప్పుడు హ్యాక్‌ అయింది. ఇలాంటివి వంద అకౌంట్లు నువ్వు క్రియేట్‌ చేయగలుగుతావు, అయినా నీ అకౌంట్‌ తిరిగొస్తుందిలే" అని భరోసా ఇచ్చాడు. (చదవండి: బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయ‌ల్‌)

A post shared by Lasya Manjunath (@lasyamanjunath)

మరిన్ని వార్తలు