Rajinikanth : రజనీకాంత్‌ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా

29 Oct, 2021 10:10 IST|Sakshi
Rajinikanth Health Rumours

Latha Rajinikanth Reacts On Rajinikanth Health: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యంపై ఆయన భార్య లతా రజనీకాంత్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. 

కాగా నిన్న సాయంత్రం రజినీకాంత్‌ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన  సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీకాంత్‌ గురువారం సాయంత్రం హుటాహుటిన రజినీ అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

చదవండి: అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌ అజయ్‌భూపతి
ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

మరిన్ని వార్తలు