సగంలోనే ఓకే చెప్పేశా: లావణ్య త్రిపాఠి

16 Mar, 2021 08:04 IST|Sakshi

‘‘భలే భలే మగాడివోయ్‌’, ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో నేను చేసిన మూడో చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ బ్యానర్‌లో మూడు సినిమాలు చేసినందుకు హ్యాపీ’’ అని లావణ్యా త్రిపాఠీ అన్నారు. కార్తికేయ, లావణ్య జంటగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘చావు కబురు చల్లగా’ ఈ 19న విడుదలవుతోంది.

లావణ్యా త్రిపాఠీ మాట్లాడుతూ –‘‘కౌశిక్‌ ఈ కథ చెబుతున్నప్పుడు కొత్తగా అనిపించడంతో సగం వినగానే నటించేందుకు ఒప్పుకున్నాను. ప్రతి మనిషికీ చావు తప్పుదు. అది వచ్చినప్పుడు బాధపడడం ఎందుకు? అనే పాయింట్‌తో సినిమా ఉంటుంది. ఇందులో నేను భర్తను పోగొట్టు కున్న అమ్మాయిగా నటించాను’’ అన్నారు. 

చదవండి: నా కొడుకుతో సహా బిగ్‌బాస్‌కు వెళ్తా!: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు