మెగా ఫ్యాన్స్‌ ఎఫెక్ట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి

11 Sep, 2023 07:31 IST|Sakshi

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టనుంది. వరుణ్‌ తేజ్‌తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ బ్యూటీ. మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో  తన అందచందాలు ప్రదర్శించడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది.

(ఇదీ చదవండి: 'సలార్‌'ను నమ్ముకున్న శృతిహాసన్‌)

అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుణ్‌ తేజ్‌తో నిశ్చితార్థం అయ్యాక అంతకు ముందే ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా రద్దు చేసు​కున్నారు. ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. తమిళ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు కొన్ని నెలల క్రితమే లావణ్య ఓకే చెప్పారు. 'స్కైలాబ్‌' సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి నో చెప్పేశారు.

(ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్‌' రికార్డ్‌.. కోట్లు కొల్లగొట్టిన షారుక్‌)

దీనికి ప్రధాన కారణం ఈ వెబ్‌ సిరీస్‌లో కథ రీత్యా కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా రొమాన్స్‌ సీన్స్‌ కూడా ఉన్నాయట. కొద్దిరోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్‌ కాదని నిర్ణయించుకున్నదట.  ఆ వెబ్‌సిరీస్‌ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్‌ని చూసుకోమని లావణ్య ఓపెన్‌గానే చెప్పేశారట. ఆమె తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేశారట.

నిశ్చితార్థం అయిన తర్వాత తాను కొణిదలవారి కోడల్ని కాబట్టి ఇక నుంచి ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పారట. దీంతో ఆమె నిర్ణయాన్ని వారు కూడా కాదనలేకపోయారట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్‌ లావణ్య నిర్ణయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు