నాకు ట్రిపోఫోబియా ఉంది: లావణ్య త్రిపాఠి

12 Aug, 2021 12:13 IST|Sakshi

తారలు తమ గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలా తెరపై అందం, అభినయంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసే హీరోయిన్లలో కూడా చిన్న చిన్న లోపాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్లు తమలోని లోపాలను  బయట పెట్టారు. తాజాగా సోట్ట బుగ్గల భామ లావణ్య త్రిపాఠి సైతం తనలోని లోపాన్ని బయట పెట్టింది. ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న లావణ్య అభిమానులతో ముచ్చటించింది. తనను నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం తను ఆహ్లదకరమైన జీవితాన్ని చూస్తున్నానని, కాంక్రిట్‌ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఒత్తిపరమైన ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన లావణ్య ప్రస్తుతం కొత్త కథలు వింటూ ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పింది. ‘మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులకు కూడా ఎలాంటి ఆనందాన్ని పంచలేము. ఈ సిద్దాంతాన్ని నేను బాగా నమ్ముతాను. మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు తరచి చూసుకోవడం ముఖ్యం.

స్వీయ విశ్లేషణ వలనే నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా సాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు రాబోతున్నానని తెలిపింది.  

A post shared by Lavanya T (@itsmelavanya)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు