లిప్‌లాక్‌ సీన్‌కు లావణ్య ఓకే చెప్పిందా?

27 Jan, 2021 16:29 IST|Sakshi

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఉత్తరాది భామ లావణ్యా త్రిపాఠి. ఇప్పటి వరకు దాదాపు 16 చిత్రాల్లో నటించినప్పటికీ ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావేవి ఆమెకు పెద్దగా విజయాన్ని చేకూర్చలేదు. అయితే భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా ఈ భామ మంచి గుర్తింపు పొందింది. చివరగా నటించిన అర్జున్‌ సురవరం సినిమా కూడా కాస్తా పరవాలేదనిపించింది. ఇక ప్రస్తుతం లావణ్య ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా) విడుదలకు రెడీగా ఉన్నాయి. చదవండి: హాకీ ఎక్స్‌ప్రెస్‌

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో లావణ్యా త్రిపాఠి ఫిమేల్‌ లీడ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైల‌ర్‌లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ క‌నిపిస్తున్నారు. అత‌డి ప్రేమికురాలిగా లావణ్య కూడా హాకీ ప్లేయ‌ర్‌ కావ‌డం విశేషం. కాగా ఈ ట్రైలర్‌లో ఓ చోట లావణ్య.. సందీప్‌ను లిప్‌లాప్‌ చేస్తున్నట్లు దృశ్యం ఒకటి ఉంది. అయితే గ్లామర్ షో చేయడం నచ్చదని చెప్పే లావణ్య ఈ సారి తన హద్దులు చెరిపేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధపడిందా అని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి : ఆటగాళ్లకు కనీస గౌరవం లేదు: హీరో

ఇప్ప‌టికే గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపించిన లావ‌ణ్య.. ట్రైల‌ర్‌లో లిప్లాక్ సీన్ లాంటి స‌న్నివేశం క‌నిపిస్తుండ‌టంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ భామ నిజంగానే ముద్దు సీన్‌లో న‌టించిందా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి లావ‌ణ్య తన పాత్ర కోసం హద్దులు చెరిపేసుకుందా..? లేదా? అనేది తెలియాలంటే సినిమాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల్సిందే. మ‌రోవైపు కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో ఇలాంటి సీన్‌లు ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక లావణ్య న‌టించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్‌, చావు క‌బురు చ‌ల్లగా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. 

మరిన్ని వార్తలు