Adipurush: ఆదిపురుష్ టీజర్‌పై ఫిర్యాదు.. వారిపై చర‍్యలు తీసుకోండి..!

7 Oct, 2022 15:09 IST|Sakshi

ప్రభాస్ లేటెస్ట్‌ మూవీ 'ఆదిపురుష్' టీజర్‌ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీజర్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొందరు బాగాలేదంటూ బహిరంగంగా విమర్శిచగా.. మరికొందరేమో యానిమోషన్ మూవీలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా రాజకీయ నాయకులు ఆదిపురుష్ టీజర్‌పై విమర్శలు చేశారు. తాజాగా ఆదిపురుష్ టీజర్‌పై కోర్టును ఆశ్రయించాడు ఓ న్యాయవాది. హిందూ దేవుళ్లను కించపరిచేలా చూపించారని ఆయన ఫిర్యాదు చేశారు. 

(చదవండి: 'ఆ పాత్ర చూస్తుంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ఒసామాబిన్‌ లాడెన్‌ గుర్తొస్తున్నారు')

ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మణ సంఘాలు నిరసనలు తెలుపుతుండగా.. ఈ సినిమాలోని నటీనటులు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్‌లో హనుమంతుడిని తోలు దుస్తులలో చూపించగా, రాముడు కూడా నెగిటివ్‌గా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్, ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్,  భూషణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై లక్నో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు