‘లెజెండ్‌’హీరో షాకింగ్‌ నిర్ణయం..ఈ సారి ఎన్ని కోట్లు పెడతాడో?

18 Sep, 2022 12:21 IST|Sakshi

తమిళ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా అవతారమెత్తిన విషయం తెలిసిందే.  53 ఏళ్ల శరవణన్‌ ఇటీవల ‘లెజెండ్‌’అనే పాన్‌ ఇండియా చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రిచ్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. అంతే కాదు శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్‌ కూడా వచ్చాయి. హీరో కాదు కదా కనీసం సైడ్‌ క్యారెక్టర్‌ చేయడానికి కూడా శరవరణన్‌ పనికిరాడని నెటిజన్స్‌ విమర్శించారు.

భారీ నష్టంతో పాటు విమర్శలు కూడా రావడంతో ఇక శరవణన్‌ సినిమాల జోలికి రాకుండా తన వ్యాపారాలను మాత్రమే చూసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తిప్పికొడుతూ తాజాగా శరవరణన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మరో సినిమాకు సిద్దమవుతున్నాడు.

(చదవండి: నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా?)

కోలీవుడ్‌ సమాచారం ప్రకారం.. శరవణన్‌ నుంచి త్వరలోనే కొత్త సినిమా ప్రకటన రాబోతుందట. ఈ సారి రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పకరించబోతున్నాడట. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్‌ చేశారట. త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్‌ చేయబోతున్నారు. అన్నట్లు.. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రమేనట. మరి దీనికి లేటు వయసు హీరో ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో చూడాలి.

మరిన్ని వార్తలు