చిరునవ్వుల వరమిస్తావా.. చితినుండి లేచొస్తా!!

5 Jan, 2021 20:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  పలువురు సినీ రంగ ప్రముఖులు, నటీనటులు, గాయనీ గాయకులు వెన్నెలకంటి మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను, అజరామర సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

1988లో వచ్చిన `మహర్షి` మూవీలోని మాటరాని మౌనమిది ప్రధానంగా  చెప్పుకోవచ్చు. అలాగే  తమిళ సూపర్‌ స్టార్‌  రజనీకాంత్‌ బిగ్గెస్ట్‌హిట్‌ చంద్రముఖిలోని  `కొంత కాలం కొంతం కాలం కాలమాగిపోవాలి’ అనే పాట కూడా అభిమానులకు ఆకట్టుకుంది. దీంతోపాటు బృందావనం చిత్రంలో  "మధురమే సుధా గానం", ఓహో ఓహో పావురమా’’, ఆదిత్య 369 చిత్రంలో ‘రాసలీల వేళ ’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలున్నాయి. వీటితోపాటు స్వాతికిరణం, బిరియానీ, ఆవారా, ఆకాశమంతా, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లోని ఆయన పాటలు విశేష ఆదరణ పొందాయి.

వెన్నెలకంటి అకాలమరణంపై గాయని చిన్మయి శ్రీపాద విచారం వ్యక్తం చేశారు. ‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను అంటూ చిరునవ్వుల వరమిస్తావా మూవీ కోసం ఆయన రాసిన గీతాన్ని తలుచుకున్నారు మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల. వెన్నెలకంటికి ట్విటర్‌ ద్వారా అశృనివాళులర్పించారు.

మరిన్ని వార్తలు