Leo Audio Launch: విజయ్‌ 'లియో' సినిమాపై పొలిటికల్‌ దెబ్బ.. ప్రభుత్వంపై ఫ్యాన్స్‌ వార్‌

27 Sep, 2023 13:59 IST|Sakshi

తమిళ చిత్రసీమలో టాప్‌ స్టార్‌లలో నటుడు విజయ్‌ ఒకరు. మల్టీ టాలెంటెడ్ నటుడు అయిన విజయ్‌కి తమిళ చిత్రసీమలో భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో విజయ్‌ నటించాడు. ఈ చిత్రంలో త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రెండోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

దీంతో లియో ఆడియో విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో లియో ఆడియో వేడక జరగనున్న నేపథ్యంలో విజయ్‌ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ అందింది. లియో సినిమా మ్యూజికల్‌ లాంచ్ కార్యక్రమం లేదని వార్త వచ్చింది. ఇదే విషయాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప్రకటించింది. తన ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా ఒక పోస్ట్‌లో, వారు ఇలా అన్నారు. 'పాస్‌ల కోసం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. అంతే కాకుండా భద్రతా కారణాల వల్ల, మేము లియో మ్యూజిక్ లాంచ్‌ను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాము. అభిమానుల కోరిక మేరకు మేము తరచుగా అప్‌డేట్‌లతో మీతో టచ్‌లో ఉంటాము. చాలామంది అనుకుంటున్నట్లుగా మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదు. అంతేకాకుండా మరేదైనా కారణం కూడా కాదు.' అని తెలిపారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్‌ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!)

ఈ పరిస్థితిలో విజయ్ అభిమానులు లియో విడుదల కార్యక్రమం రద్దు కావడం వెనుక స్టాలిన్‌ డీఎంకే ప్రభుత్వం ఉందని విజయ్‌ ఫ్యాన్స్‌ చెబుతూ #DMKFearsThalapathyVIJAY అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ అభిమానులు #LeoAudioLaunch #westandWithLeoతో సహా హ్యాష్‌ట్యాగ్‌లను వారు ట్రెండింగ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు