బెస్ట్‌ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ

19 Nov, 2020 11:34 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌: అందరం కలిసి రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేద్దాం.. ఓటుతో నచ్చిన వాళ్లను వేగంగా ఎంచుకుందాం.. హైదరాబాద్‌ను బెస్ట్‌ సిటీగా మార్చుకుందాం. ట్రాఫిక్‌ రూల్స్‌ లాంటివి పక్కాగా ఫాలో అవ్వాలి. అంటే కొద్దిగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో చేస్తున్న అభివృద్ధి మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకోండి. ఓటుకు నచ్చిన వారిని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకుందాం.  

డెవలప్‌మెంట్‌  సో బెటర్‌
ఓటు అనేది మన హక్కు. ఈ నగరానికి చెందిన ఒక పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోవడం నాతో పాటు మనందరి బాధ్యత. ఈ బాధ్యత మన నగరం, రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం. హైదరాబాద్‌లో చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌(మౌలిక రంగం) కూడా బాగా డెవలప్‌ అయింది. మన రోడ్లు, మన ఫ్లై ఓవర్‌లు, మన హైవేలు ఓ పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నాయి. వ్యక్తిగతంగా, పౌరులుగా మనందరం కలిసి కట్టుగా ఉండి నీటి వనరులను కాపాడుకోవాలి. మన చెరువులు, మూసీనది.. ఇవన్నీ నగర భవిష్యత్‌కి ఎంతో ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవాలి. చెరువుల్ని ఆక్రమించడం,  వాటిని చెత్తతో నింపేయడం లాంటి విషయాలను గట్టిగా వ్యతిరేకించాలన్నది నా అభిప్రాయం.
– ఆనంద్‌ దేవరకొండ,  సినీనటుడు

మరిన్ని వార్తలు