హీరోయిన్‌ అనుష్క సోదరునికి ప్రాణభయం

13 Jun, 2022 07:42 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గ్యాంగ్‌స్టర్ల మధ్య విభేదాలతో ప్రముఖ బహుభాషా నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్‌ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు వార్తలొచ్చాయి. వివరాలు... గతంలో ప్రముఖ మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్‌ రై, గుణరంజన్‌శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు.

ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్‌ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దీంతో అసూయ పట్టలేని మన్విత్‌ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్‌ అనుచరులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. ఈ  ఆరోపణలను మన్విత్‌ రై తోసిపుచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

చదవండి: విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్‌ సర్‌’ అంత బాగా ఎలా పేలాడు?

మరిన్ని వార్తలు