దసరాకి టీజర్‌

19 Oct, 2020 03:50 IST|Sakshi

‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కార్తీక్‌ రాజు హీరోగా, సుప్యార్దే సింగ్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లింగొచ్చా’. ఆనంద్‌ బడా ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్‌ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీకల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యాదగిరి రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరగుతున్నాయి. యాదగిరి రాజు, ఆనంద్‌ బడా మాట్లాడుతూ– ‘‘దసరా కానుకగా ఈ నెల 23న మా సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ‘లింగొచ్చా’ టైటిల్‌కి అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆyì య¯Œ ్సలో మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మల్లేశ్‌ కన్జార్ల, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: సందీప్‌ తుమ్కుర్, శ్రీనాథ్‌ చౌదరి, సంగీతం: బికాజ్‌ రాజ్‌.

మరిన్ని వార్తలు