వరుణ్‌ సందేశ్‌ లేటెస్ట్‌ మూవీ..ఈ సాంగ్‌ చూశారా?

5 Jul, 2021 21:19 IST|Sakshi

వరుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఇందువదన".ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి  'వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా' అంటూ ఓ సాంగ్‌ రిలీజ్‌ అయింది. శివ కాకాని సంగీతాన్ని అందించగా, జావేద్ అలీ, మాళవిక ఆలపించారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక వరుణ్‌ సందేశ్‌ చేస్తోన్న మొదటి ప్రాజెక్ట్‌ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ అటవీశాఖ అధికారి పాత్ర పోషించగా, ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిలా కనిపించనుంది. ఈ సినిమాతో ఫర్నాజ్ హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించనుకోనుంది. ఇక రఘు బాబు, అలీ, సురేఖ వాణి, ధనరాజ్‌కీ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలె షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు