చిరు టూ సాయి తేజ్‌... తమన్‌ జోరు మాములుగా లేదుగా

20 Jul, 2021 16:01 IST|Sakshi

మెగా హీరోస్ ఫెవరెట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌

టాలీవుడ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్. ముఖ్యంగా మెగా హీరోస్ తమన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ కు అల వైకుంఠపురము లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించాడు.అదే స్పీడ్ లో వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ వర్క్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ నటించిన నాయక్, బ్రూస్ లీ లాంటి సినిమాలకు సూపర్ హిట్ ట్రాక్స్ అందించాడు తమన్. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మరోసారి చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు తమన్. పైగా ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫర్. శంకర్‌-చెర్రీ కాంబోలో రాబోతున్న మూవీకి తమనే సంగీతం అందిస్తున్నాడు. 

అలాగే లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం కూడా తమన్ వర్క్ చేయబోతున్నాడు.కెరీర్ లో ఫస్ట్ టైమ్ చిరు నటిస్తున్న సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా తమన్ తో చర్చలు ప్రారంభించాడు. 

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు ఇప్పటికే ప్రతి రోజూ పండగే మూవీతో సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు. ఇఫ్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా గని కి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. మొత్తంగా మెగా హీరోస్ మూవీస్ కు మ్యూజిక్ అందిస్తూ  మెగా మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు తమన్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు