ఎండలు బాగా మండే ఏప్రిల్‌లో సందడి చేసే సినిమాలివే!

6 Jan, 2023 15:05 IST|Sakshi

సంక్రాంతి సీజన్‌ తర్వాత సినిమాలకు బాగా కలిసొచ్చేది సమ్మర్‌. సమ్మర్ హాలీడేస్‌ను బాగా వాడుకోవాలి అనుకుంటారు మేకర్స్. అందుకోసం తమ సినిమాలు రిలీజ్‌ అయేలా ప్లాన్ చేసుకుంటారు. ఎండలు బాగా మండే ఏప్రిల్‌  నెలలో రిలీజ్‌కు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

పొన్నియిన్ సెల్వన్ ఎంత పెద్ద  హిట్‌ అయిందో తెలిసిన విషయమే. గతేడాది సెప్టెంబర్‌ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ మూవీ సెకండ్ పార్ట్  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28 న రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

సూపర్ స్టార్‌ రజినీ కాంత్‌ నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌తో ఆకట్టుకున్నారు మేకర్స్. ఈ మూవీని ఏప్రిల్ 14 న రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. అలాగే మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ మూవీని కూడా ఏప్రిల్ 14 న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇక మెగా మేనల్లుడు సాయి తేజ్ ఏప్రిల్ 21 విరుపాక్ష మూవీతో రావాటానికి ముస్తాబు అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాతో సాలిడ్ విజయం అందుకున్నాడు.ఈయన కెరీర్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది ధమాకా. త్వరలో రావణ సుర మూవీతో రాబోతున్నాడు. ఏప్రిల్ 7 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ ముచ్చటకు వస్తే..సల్మాన్ ఖాన్ ‘కిసికా బాయ్ కిసికా జాన్‌’ కూడా ఏప్రిల్‌లో విడుదలకు ముస్తాబు అయింది. ఏప్రిల్ 21 న మూవీ రిలీజ్ కాబోతుంది.

మరిన్ని వార్తలు